టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఫెయిల్యూర్‌గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథ మరియు కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్సవ్వడంతో సైంధవ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. సైంధవ్ డిజిటల్ హక్కులు పదిహేను కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. త్వరలోనే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.థియేటర్లో ఈ మూవీ రిజల్ట్ కారణంగానే నెల రోజులు కూడా గడవక ముందే సైంధవ్ ఓటీటీలోకి వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది…
తొలుత ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ థియేటర్లలో షాకింగ్ రిజల్ట్ రావడంతో ఫిబ్రవరి 9నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.థియేటర్లలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా మహేష్ గుంటూరు కారం మూవీ తో పోటీ పడిన వెంకటేష్ సైంధవ్ మరోసారి ఓటీటీలో పోటీపడబోతున్నట్లు సమాచారం. గుంటూరు కారం, సైంధవ్ ఓకేరోజు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది.అయితే థియేటర్ వెర్షన్ తో పోలిస్తే సైంధవ్ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ వెర్షన్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు సాంగ్‌ను కూడా యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌లో లెంగ్త్ ఎక్కువైందనే ఆలోచనతో ఈ సీన్స్ డిలీట్ చేసినట్లు సమాచారం..దీనితో ఓటీటీలో ఈ డిలీటెడ్ సీన్స్ యాడ్ చేయనున్నట్లు తెలుస్తుంది.