DC vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 162 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 10 ఓవర్లలో 3 మూడు కీలక వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్(32), విజయ్ శంకర్(15) ఉన్నారు. వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ తగ్గింది.
Read Also: DC vs GT: ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. గుజరాత్ లక్ష్యం 163
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 37, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేయగా.. చివర్లో అక్షర్ పటేల్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల మార్క్ అందుకునేలా చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.