Sai Ram Shankar : టాలీవుడ్ యంగ్ హీరో సాయిరామ్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 143 సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు తప్పితే పెద్దగా కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడే సినిమాలు లేవనే చెప్పాలి. దీంతో ఎంతో కాలంగా ఆయన హిట్ కోసం పరితపిస్తున్నారు. ఇప్పుడు ఈ యువ హీరో తన కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నాడు. సాయిరామ్ శంకర్ నటిస్తున్న ఈ కొత్త సినిమా ఇప్పటి వరకు ప్రకటించబడిన చిత్రాల కంటే కొంచెం కొత్తదనంతో పాటు ఎక్స్ ట్రా ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Read Also:APPSC Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్
సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర విశేషాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ “ఇది నా కెరీర్ కి ఎంతో హెల్ప్ అయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఈ చిత్ర దర్శకుడు వినోద్ తో నేను 2005 నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇందులో నా పాత్ర స్టోరీని డ్రైవ్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు సాయి రామ్ శంకర్.
Read Also:Cricket Betting: సంచలనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ కేసు.. రూ.176 కోట్లు..!
చిత్ర దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలన్నా, తెలుగువాళ్ళన్నా, తెలుగు పచ్చళ్లన్నా చాలా చాలా ఇష్టం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి. రెండు పాటలూ సిద్ శ్రీరామ్ పాడారు. రాజీవ్ రాయ్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి” అన్నారు.సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.