Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరుమీద ఉంది. జూన్ 2024లో సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 27 బంతుల్లోనే శతకం బాది ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ కేవలం 41 బంతుల్లోనే 18 భారీ సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో అజేయంగా 144 పరుగులు సాధించాడు.
ఇక భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది ఈ అరుదైన ఘనత సాధించాడు. అయితే అభిషేక్ శర్మ సాధించిన అత్యంత వేగవంతమైన శతకం ప్రపంచంలోనే నంబర్ 1 అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ముందు వరుసలో సాహిల్ చౌహాన్ ఉండటంతో అతడు ఎవరు.. ఎప్పుడు ఈ శతకం సాధించాడు అని చాలా మంది తెలుసుకోవాలని ఆత్రుతతో నెట్ లో అతడి గురించి వెతకడం మొదలు పెట్టారు.
Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
అతడి నేపథ్యం విషయానికి వస్తే.. సాహిల్ అసలు ఎస్టోనియా దేశానికి చెందిన వ్యక్తి కాదు. అతనిది హరియాణా రాష్ట్రంలోని పింజోర్. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అతను కొద్ది సంవత్సరాల క్రితం యూరప్‌కు వలస వెళ్లి ఎస్టోనియాలో స్థిరపడ్డాడు. అక్కడ స్థానికంగా రెస్టారెంట్ చైన్ మేనేజర్‌గా పనిచేస్తూనే, క్రికెట్ మీద ఉన్న మక్కువతో అక్కడి స్థానిక క్లబ్ మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఎస్టోనియా జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కూడా అతను ఎస్టోనియా జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. స్థానిక టీ10 లీగ్‌లలోనూ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. భారతీయ మూలాలు ఉన్న సాహిల్ చౌహాన్ ప్రపంచ క్రికెట్ రికార్డుల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడం విశేషం.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!