Sadha : ఇప్పటికీ ఆ సీన్ చుస్తే కంపరంగా అనిపిస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన దర్శకుడు తేజ.దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాలో సదా హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా గురించి సదా ఆసక్తికర విషయం తెలియ జేసింది.సదా మాట్లాడుతూ జయం సినిమాలో ఆ సీన్ చూస్తే ఇప్పటికీ కంపరంగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది . జయం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో సదా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఓ దశాబ్ధం పాటు వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసనన నటించి మెప్పించింది.అయితే ఆ సినిమాలోని ఓ సీన్ తన జీవితంలో మర్చిపోలేని చేదు గుర్తుగా నిలిచిపోయింది అన్నారు సదా.
నితిన్ ను కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు.అయితే ఆసీన్ లో విలన్ గా చేసిన గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను ఈ సినిమాలోనుంచి తీసేయండి అంటూ వేడుకుందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడని సమాచారం.అంతే కాదు సదా ఇబ్బంది చూసి.. విలన్ గా చేస్తున్న గోపీచంద్ కూడా వద్దులేండి సార్.. ఆమె అంత ఇబ్బంది పడుతుంది అని అన్నారట. కాని తేజ మాత్రం నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. ఇక అక్కడ ఉన్నవారు కూడా సదాకు సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందటా.ఇక ఆసీన్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లి బాగా ఏడ్చిందట సదా. అంతే కాదు.. పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుని ఎంతగానో బాధ పడినట్లు ఆమె తెలియజేసింది.. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ బాధపడుతుంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు