Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత్ ఘోర పరాజయం పాలవడంపై మాజీ ఓపెనర్ సదాగోపన్ రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ సిరీస్‌ను చాలా తేలికగా తీసుకుందని, ఆటగాళ్లు దీనిని ఒక ‘పిక్నిక్ టూర్’లా భావించారని ఆయన విమర్శించారు. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌పైనే దృష్టి పెట్టి, ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడం వల్లే ఈ పరాభవం ఎదురైందని, ఐర్లాండ్ జట్టు భారత్‌కు సరైన గుణపాఠం చెప్పిందని ఆయన తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నారు.
అతివిశ్వాసమే ముంచేసింది..
భారత జట్టుకు అతివిశ్వాసం అసలు మంచిది కాదని, దాని వల్లే ఈ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని రమేష్ విశ్లేషించారు. ఈ ఐర్లాండ్ సిరీస్ మొదట అనుకున్న షెడ్యూల్లో లేదు. ఇంగ్లాండ్ ప్రధాన సిరీస్ అయితే, ఇది కేవలం ఒక పికిల్ లాంటిదని, అయితే భారత్ ఆ ఘాటును తట్టుకోలేకపోయిందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత, భారత ఆటగాళ్లు మూడు నెలల పాటు ఐపీఎల్లో ఆడారు. ఇలా వరుసగా నాలుగు నెలలు టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉండి కూడా, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం నమ్మశక్యం కాని విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏనుగు కూడా ఒక్కోసారి అడుగు తడబడుతుంది కానీ, ఐర్లాండ్ లాంటి జట్టుపై ఇలా జరగడం ఘోరమైన విషయమన్నారు.
రెండో టీ20పైనే సర్వత్రా ఆసక్తి..
మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి, 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. హర్షిత్ రాణా (3 వికెట్లు), అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49) మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం (జూన్ 28) జరగబోయే రెండో టీ20 మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ కెరీర్లో తొలి టీ20 సిరీస్ పరాజయాన్ని తప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
తాజావార్తలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!