ICC names Sachin Tendulkar as Global Ambassador for ODI World Cup 2023: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023కి సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గ్లోబల్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీతో సచిన్ మైదానంలోకి వస్తాడు. దాంతో ప్రపంచకప్ 2023 అధికారికంగా ఆరంభం అవుతుంది.
Aslo Read: Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో జనాలకు రూ.2000కోట్లకు కుచ్చుటోపీ
మరోవైపు ప్రపంచకప్ 2023 కోసం ఐసీసీ పలువురు మాజీ క్రికెటర్లను అంబాసిడర్లుగా ప్రకటించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ సారథి ఆరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్, భారత మాజీ ప్లేయర్ సురేశ్ రైనా, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ ఉన్నారు.