వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞనేశ్వర్, ఎమ్మెల్సీ సురభి వాణి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తరపున నిలుచోబెట్టి గెలిపించారు కేసీఆర్.. కానీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో తరుఫున ఎంపీగా పోటీ చేశాడు ఓడిపోయాడని, ఇప్పుడు అదే తప్పు రంజిత్ రెడ్డి చేస్తున్నారని ఆమె అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి రంజిత్ రెడ్డి ఎవరో తెలియదు. ఏ ప్రాంతానికి చెందిన వాడు తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి చేవెళ్ల పార్లమెంట్కు టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలుచోబెట్టి గెలిపించి రంజిత్ రెడ్డి స్థాయిని పెంచింది కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిసి తిరిగి ఎంపిక నిలబడుతున్నాడు అప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా ఓడిపోతాడని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిశాడో ఎవరికీ తెలియదు బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డికి ఎప్పుడు అన్యాయం చేయలేదననారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించి పార్టీ మారిన వారికి బుద్ధి చెబుతామని ఇంద్రారెడ్డి అన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో నిల్చమని ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాలతో చేవెళ్ల పార్లమెంట్ కు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ అని అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలి పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడుతానన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాము కాంగ్రెస్ పార్టీలోనే నష్టపోయామన్నారు. పార్టీ కోసం ఎంతో చేశాము పార్టీ గుర్తించలేకపోయింది అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వారికి హెతిక్స్ ఉండాలి పార్టీ ఎక్కడ పోలేదు మళ్లి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞనేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి ప్రజలు ఆశీర్వదిస్తారు అని ఆమె అన్నారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. గెలుపొందిన నియోజకవర్గాలు భాగానే ఉన్నాయి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. పార్టీ గతంలో ఎంపీ అవకాశం కల్పించింది ఎంపిగా గెలిపించింది ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయిందని పార్టీ మారారు కొందరు … పార్టీ మారిన వారు నష్టపోదు పార్టీ మారిన వారే నష్టపోతారు కాసాని జ్ఞానేశ్వర్నీ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రకాష్ గౌడ్ అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రను తెచ్చుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ … కొంతమంది ఎమ్మెల్యే లపై కొపంతో ప్రజలు ఓడించారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని అనుకుంటున్నారు … కేసీఆర్ ఏ హామీలు ఇస్తామని ప్రజలకు చెప్పలేదు .. ఏదో చెయ్యాలి అనుకొని రైతు బందు, రైతు భీమా ,మిషన్ భాగీరథ ,వృద్దులకు వితంతులకు పెన్షన్లు, యాదవులకు గొర్లు ఇలా ఎన్నో పథకాలతో చేయుత అందించిన ఘనత కేసీఆర్ దే .. కాసాని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.