Site icon NTV Telugu

Sabitha Indra Reddy : కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..

Ts

Ts

కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎక్స్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు. ” సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్‌ గురించి మీరు మట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటు పాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి.” అని రాసుకొచ్చారు. మీరు చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడతారు కదా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.

READ MORE: Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు.

READ MORE:CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం..

Exit mobile version