మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎక్స్ లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నాడు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.." అని రాసుకొచ్చాడు.
కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎక్స్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు. " సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు.