అందాల తారలు నివేద థామస్, రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకిని ఢాకిని. అయితే ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను కామెడీ యాక్షన్ థ్రిల్లింగ్ తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ తో కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే.. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందుగా చెప్పినట్లుగానే ఈ ట్రైలర్ ప్రారంభంలో శాలిని పాత్రలో నివేద థామస్, దామిని పాత్రలో రెజీనా కసండ్ర పోలీస్ అకాడమీలో ట్రైనింగ్‌కు వచ్చి పరిచయమవుతారు.
అయితే.. వీరిద్దరూ మధ్య జరిగే సన్నివేశాలు హాస్యాన్ని పూయించినట్లు ట్రైలర్‌లో చూపించారు. అయితే.. ఇదిలా ఉండగానే ఓ రాత్రి వీరిద్దరూ పార్టీకి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై ఓ యువతిని రౌడీమూకలు ఎత్తుకుపోవడం.. వారిని వీరిద్దరూ వెంబడించడం.. ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. అయితే.. రౌడీలు ‘ఐవీఎఫ్’ ద్వారా పిల్లలు లేని వారికి గర్భాదానం కోసం యువతులను కిడ్నాప్ చేసి.. వారి గర్భశయం ద్వారా ఈ పిల్లలు లేని వారికి గర్భాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. అయితే ఆ రౌడీ మూకలను నుంచి యువతులను ఏవిధంగా కాపాడారు.. అనేది ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. అయితే ఆదంత్యం ట్రైలర్ కామెడీతో యాక్షన్ థ్రిల్లింగ్‌ను చూపిస్తోంది. అయితే.. మల్టీస్టారర్‌గా యువ హీరోలు మెప్పిస్తున్న తీరులోనే.. ఈ యువ భామలు నట్టించిన శాకిని ఢాకిని సినిమా కొత్త పంథాకు పునాదులు వేస్తుందో చూడాలి మరీ.