నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-1తో…
భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో…