S Sreesanth React on Hardik Pandya’s Captaincy: గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్నపుడు ఆ జట్టు బౌలర్లను హార్దిక్ ఇబ్బంది పెట్టాడు అని అర్థం వచ్చేలా శ్రీశాంత్ పేర్కొన్నాడు. బౌలర్లకు హార్దిక్ ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వడన్నాడు. కొన్నిసార్లు బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా అవకాశం ఇవ్వాలని కేరళ స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని ట్రేడ్ విధానంలో దక్కించుకుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టును రెండు సార్లు ఫైనల్‌కు చేర్చిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కి వెళ్లడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ రాకతో ముంబై ఫ్రాంచైజీ సక్సెఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. 5 టైటిళ్లు సాధించిన రోహిత్‌ను పక్కనపెట్టి.. హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ఈ నిర్ణయం జట్టులో అంతర్గత విభేదాలు మొదలయ్యాయని నెట్టింట వార్తలు వచ్చాయి. చాలామంది మాజీలు కెప్టెన్సీ మార్పుపై పెదవి విరిచారు. కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. శ్రీశాంత్ హార్దిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Shubman Gill Fine: శుభ్‌మాన్ గిల్‌కు భారీ షాక్.. 12 లక్షల జరిమానా!
ఫ్యాన్‌కోడ్ సూపర్ ఓవర్‌లో శ్రీశాంత్ మాట్లాడుతూ… ‘బౌలర్లు ఏం చేయాలో చెప్పడానికి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో హార్దిక్ పాండ్యా లేడు. కొన్నిసార్లు బౌలర్‌లకి స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ బౌలర్లకు ఆ అవకాశం ఇస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యువ కెప్టెన్‌ను కలిగి ఉన్నప్పుడు బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలి’ అని ఎస్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా నిష్క్రమణ తర్వాత గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్‌ను నియమించిన విషయం తెలిసిందే.