S. S. Rajamouli Bday Special : ఓటమి ఎరుగని ధీరునికి ‘ఆస్కార్ సెల్యూట్’
- నేడు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు
- మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్న రాజమౌళి
- జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్న రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళిగా అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీపేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను ఎవరు చూస్తారు అనే స్థాయి నుండి తెలుగు సినిమా వస్తోంది ఎగబడి చూడాలి అనే స్థాయికి తీసుకువెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి SS రాజమౌళి.
కుటుంబ నేపథ్యం :
తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ రచన చేసారు. ఇక రాజమౌళికి 2001లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి ప్రతి సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యహరిస్తారు. రాజమౌళి గురించి రెండు ముక్కల్లో రమా రాజమౌళిని చెప్పమంటే పని రాక్షసుడు అంటూ ప్రేమగా బదులిస్తారు. కొడుకు కార్తికేయ రాజమౌళి సినెమాలకు అన్ని తానై వ్యవహరిస్తారు. ఆస్కార్ విజేత MM. కీరవాణి రాజమౌళికి పెదనాన్న అవుతారు.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
సినీ జీవితం :
మొదట్లో తన గురువు రాఘవేంద్ర రావ్ దగ్గర శిష్యరికం చేస్తూ అయన నిర్మాణంలో శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించాడు. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. అలా జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం. 1 చిత్రంతో వెండితెరపై తొలిసారిగా రాజమౌళి పేరు పడింది. కానీ ఆ రోజు ఎవరు ఊహించలేదు ఆ పేరు రానున్న రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని. ఆ పేరు గల స్టాంప్ పడితే ఆ సినిమా తిరుగులేని విజయం సాదిస్తుందని. రెండవ సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. విక్రమార్కుడు, మగధీర, ఈగా, సై, యమదొంగ, మర్యాద రామన్న ఇలా వరుస హిట్స్ తో తెలుగు సినిమా చరిత్రలో ఇంత వరకు ఏ దర్శకుడు అందుకొని రికార్డు సాధించాడు రాజమౌళి. ఇక బాహుబలి సిరీస్ తో రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. RRR సినిమాతో కళామతల్లి ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లారు.
ప్రత్యేకత :
తాను అనుకున్న విజన్ ను స్క్రీన్ పై కనిపించాలని ముందుగా రాజమౌళి నటించి చూపించి నటీనటుల నుండి ఆ ప్రతిభను బయటకు తీయడం ఆయన స్పెషల్. ప్రతీ సీన్ ని అద్భుతమైన విజన్ తో హై స్టాండర్డ్స్ తో విజువల్ గా తెరకెక్కిస్తారు రాజమౌళి. ఈగ, యమదొంగ, మగధీర, బాహుబలి రాజమౌళిలోని దర్శకత్వ పటిమకు నిదర్శనాలు. కృషుడి సాయంతో అర్జునుడు యుద్ధం గెలిచినట్టు తండ్రి విజయేంద్రప్రసాద్ రచనలతో సిల్వర్ స్క్రీన్ పై రాజామౌళి అద్భుత సృష్టించి గొప్ప గొప్ప విజయాలు సాధించారు దర్శక ధీరుడు.
నంది టూ ఆస్కార్ :
బెస్ట్ డైరెక్టర్ గా రాష్ట్రప్రభుత్వం అందించే నంది అవార్డు నుండి ప్రపంచ ప్రఖ్యాతి ఆస్కార్ అవార్డు వరకు ఇలా రాజమౌళి సినిమా ముద్దాడని అవార్డు లేదు. 1970 ఆక్టోబరు 10న జన్మించిన రాజమౌళి రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి, మరెన్నో పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనసారా కోరుకుంటూ ఓటమి ఎరుగని ‘కళామతల్లి లాలీపోసి పెంచిన ముద్దు బిడ్డ’ SS రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!