Russia Over Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. సోమవారం రాత్రి రష్యా 100కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో రష్యా ఉక్రెయిన్‌కు చెందిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలనే టార్గెట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
Read Also:Jagtial Murder Case: పిన్ని కాదు, పిశాచి.. తల్లిదండ్రులపై అసూయతో..!
ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. గత వారం రోజుల్లో రష్యా సుమారు 1,270 డ్రోన్లు, 39 మిసైళ్లు, ఇంకా 1,000కుపైగా గ్లైడ్ బాంబులు వదిలినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే, రష్యాలో మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రవాణా మంత్రి రోమన్ స్టారోవోయిట్ ను పదవి నుండి తొలగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ను మృతిగా కనుగొన్నారు. అధికార వర్గాలు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నాయి.
Read Also:EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి..
రోమన్ స్టారోవోయిట్ పదవీ తొలగింపుకు కారణంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడుల బెదిరింపులతో రష్యాలోని అనేక విమానాశ్రయాలు కార్యకలాపాలు నిలిపివేయడమేనని ప్రకటించింది. మరోవైపు రష్యా సైన్యం సుమారు 1,000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న యుద్ధ మార్గంలో కొన్ని కీలక ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేస్తోంది. ఉక్రెయిన్ సైన్యం కూడా దీన్ని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. శాంతి చర్చలు సరిగా జరగక పోవడంతో ఉక్రెయిన్ మరింత మిలిటరీ సహాయం కోసం అమెరికా, యూరప్ దేశాల వైపు చూస్తోంది.