Ashwathama: ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిపోల మూసివేతను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లాభ నష్టాలతో కాకుండా కొత్త బస్సులను పెంచి.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని కోరారు.
Read Also: Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..
Also Read
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
మరోవైపు రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు అధిక భారం పడుతుందని అశ్వత్థామ ఆరోపించారు. మరోవైపు మహిళా కార్మికులపై పని భారం పెరిగిందని.. మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అన్ని డిపోల్లో పర్యటించి.. వారందర్నీ ఏకతాటికి తీసుకొస్తామన్నారు. కార్మికుల సమస్యలను ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ దృష్టికి తీసుకెళ్తామని ఆయ తెలిపారు. రాజకీయలకు అతీతంగా ఏర్పడిన జేఏసీలో ఇతర కార్మికులందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!