మాస్ మహారాజ రీసెంట్ గా మాస్ జాతరతో మరో ప్లాప్ అందుకున్నాడు. అయినా సరే సినిమాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 76వ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు.
Also Read : Trending Topic : సోషల్ మీడియాని ఊపేస్తున్న గిరిజా.. ఇంతకీ ఎవరామె?
ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ విషయాన్నీ ఈ రోజు మధ్యాహ్నం 3.33 కు అఫీషియల్ గా ప్రకటించనున్నారు. సంసార సాగరంలో భర్తలు అనుభవించే కష్టాలు, భార్య భర్తల మధ్యవచ్చే తగాదాలు వంటి అంశాలతో రాబోతున్న ఈ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ ఎన్నోఆశలుపెట్టుకున్నారు. అటు దర్శకుడు కిషోర్ తిరుమలకు కూడా ఈ సినిమా కీలకం. ఆయన గత చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు నిరాశపరిచింది. భర్త మహాశయులకు విజ్ఞప్తితో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఈ సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నడు. ధమాకా, మాస్ జాతర తర్వాత హ్యాట్రిక్ సినిమాగా ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు