హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. సినీనటుడు బాలకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయ్. ఏదో ఒకటి మాట్లాడటం తప్పైపోయిందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటు. కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘటనపై ఆయన మాట్లాడారు. తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు కోసం భాస్కర్ రెడ్డి చందాలు వసూలు చేశాడన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. నరసరావు పేటలో కూడా చందాలు వసూలు చేసి ప్రభ కట్టాడు. తిరునాళ్లకు కూడా తీసుకెళ్లకుండా మధ్యలోనే ప్రభ నిలిపివేశాడు.. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతీ విషయంలోనూ న్యూసెన్సు చేస్తుంటాడు. చందాలిచ్చిన వారు కూడా నాకు అతని పై ఫిర్యాదులు చేశారు.
Read Also: Boora Narsaiah: తెలంగాణలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో..
మాకు వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు బాలకృష్ణ. మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడటానికి మీకేం పని? ఏదైనా మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలి. నువ్వు హీరోవైతే మీ టీడీపీకి గొప్ప నాకు కాదు. మా నియోజకవర్గంలో జరిగిన విషయం పై స్పందించడానికి మీరెవరు ? ఏదైనా మాట్లాడే ముందు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. బాలకృష్ణకు ఇదే నా సవాల్.. జరిగిన సంఘటనపై చర్చించేందుకు నేను సిద్ధం.. ఓ పనికిమాలిని వెధవకు వత్తాసు పలికి బాలకృష్ణ దిగజారొద్దు. మనుషులకు మూడోకన్ను ఉండదు. బాలకృష్ణ కూడా మనిషే. సినిమాల్లో మాదిరి నటన రాజకీయాల్లో కుదరదని బాలకృష్ణ తెలుసుకోవాలని హితవు పలికారు శ్రీనివాసరెడ్డి.
Read Also: PVT04: అప్పుడు కోలీవుడ్ హీరో.. ఇప్పుడు మాలీవుడ్ హీరో.. బావుందయ్యా వైష్ణవ్