SS Rajamouli Family: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. 28వ అంతస్థులో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Family panicked after Small Earthquake hits Japan: ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన ఫ్యామిలీ.. భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము 28వ అంతస్థులో ఉండగా భూమి కంపించిందని, తాను భయాందోళనకు గురయ్యానని కార్తికేయ పేర్కొన్నారు.
‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. నేను భయాందోళనకు గురయ్యా. కానీ మా చుట్టూ ఉన్న జపనీయులందరూ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా లైట్ తీసుకున్నారు. మొత్తానికి మేం భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేశాం’ అని ఎస్ఎస్ కార్తికేయ ఎక్స్‌లో పేర్కొన్నాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌గా ఇండియాకి తిరిగి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్!
భూకంప తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి ఫ్యామిలీ జపాన్ పర్యటనలో ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లారు.
Felt a freaking earthquake in Japan just now!!!
Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D— S S Karthikeya (@ssk1122) March 21, 2024
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!