Gujarat Titans Name Sandeep Warrier as Mohammed Shami Replacement: ఐపీఎల్ 2024కు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 17వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా గాయపడ్డ షమీ.. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఐపీఎల్ సమయంలో అతడు పునరావాసం పొందనున్నాడు.
మహ్మద్ షమీ స్థానంలో కేరళ స్పీడ్‌స్టర్ సందీప్ వారియర్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుంది. కనీస ధర రూ.50 లక్షలకు అతడిని గుజరాత్ తీసుకుంది. 32 ఏళ్ల వారియర్ 2019 నుంచి 5 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 7.88 ఎకానమీ రేట్‌తో రెండు వికెట్లు పడగొట్టాడు. వారియర్ గతంలో కోల్‌కతా, బెంగళూరు, ముంబై జట్ల తరఫున ఆడాడు.
Also Read: Vishnu Manchu: ‘కన్నప్ప’ నా మనసుకు ఎంతో దగ్గరైంది: మంచు విష్ణు
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. లక్నో స్టార్ పేసర్ డేవిడ్ విల్లే.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత్‌కు రాకుండా ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. గత రెండు నెలలుగా ఇంటర్నేషనల్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్న విల్లే.. పీఎస్‌ఎల్ ఫైనల్ అనంతరం వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ స్వదేశానికి వెళ్లిపోయాడు.