Vaibhav Sooryavanshi: “నా మెరుపు ఇన్నింగ్స్ వెనుక రహస్యం ఇదే”.. వైభవ్ సూర్యవంశీ ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో మూడవ మ్యాచ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. 128 లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజంటేషన్ వేడుకలో తన సంచలన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాలను, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని వైభవ్ వెల్లడించాడు. కోచ్ కుమార్ సంగక్కరతో పాటు సీనియర్ ఆటగాళ్లందరూ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపాడు. తన సహజసిద్ధమైన ఆటనే ఆడమని ప్రోత్సహించారన్నాడు. ఓపెనింగ్ పార్టనర్ యశస్వి జైస్వాల్ ప్రతి బాల్‌కి మధ్య తనతో మాట్లాడుతుంటారని వెల్లడించాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలి, ఎప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి అనేది చెప్తూ నన్ను ఎంకరేజ్ చేశాడన్నాడు. చిన్న లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించడమే తన ప్లాన్ అని చెప్పుకొచ్చాడు.
Also Read
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
అంతే కాదు మరిన్ని ఆసక్తికర విషయాలను సైతం వైభవ్ పంచుకున్నాడు. “మార్చి 27న నా పుట్టిన రోజు. జట్టులోని సభ్యులంతా కలిసి పుట్టిన రోజు వేడుకలకు ప్లాన్ చేశారు. ముఖానికి కేక్ పూస్తారేమో అని భయమేసింది. అందుకే నేను ముందుగానే నిద్రపోయాను. బయట కేక్ కటింగ్ హడావిడి జరుగుతోంది. కేక్ స్మెరింగ్ ఇష్టం లేక నేను త్వరగా పడుకున్నాను.” అంటూ అమాయకంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. ఈ యువ ప్లేయర్‌పై రియాన్ పరాగ్ స్పందించాడు. వైభవ్ ఆట తీరును ఎంతగానో మెచ్చుకున్నాడు. నెట్‌లో వైభవ్ బ్యాటింగ్ చూసి తాము ఫిదా అయ్యేవాళ్లమని పరాగ్ తెలిపాడు. బయట మీడియాలో ఏం జరుగుతుందో పట్టించుకోవద్దని, అన్ని మ్యాచ్‌ల్లోనూ నీ శైలిలోనే ఆడమని అతనికి చెప్పినట్లు తెలిపాడు. అతన్ని తన ఇష్ట ప్రకారం ఆడనివ్వాలని కోచ్‌లకు సైతం సూచన చేసినట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!