Rowdy Gang: వరంగల్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. డ్రగ్స్ సేవించి మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత నేరాలబాట పడుతున్నారు. ఇలా గంజాయి మత్తులో కొందరు యువకులు రౌడీ గ్యాంగ్ గా ఏర్పడి అమాయకులపై దాడికి దిగుతున్నారు. తాజాగా వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయి ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఎస్సార్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేట లో దాడుల ఘటన మరవకముందే హనుమకొండ లో మరో ఘటన చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపూర్ క్రాస్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్ పై రౌడీ మూక దాడికి పాల్పడ్డారు. గొంతుపై కత్తి పెట్టి ఆటోలో పోచమ్మకుంట స్మశానవాటికకు తీసుకెళ్లారు.
Read also: Polena Anjana: పవన్ కల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?
అతనిపై తీవ్రంగా దాడి చేసి రూ.10 వేల నగదు, సెల్ ఫోన్ తీసుకున్నారు. గొంతుపై స్క్రూ డ్రైవర్ పెట్టి చంపుతామని బెదిరించి వారికి తెలిసిన బేకరీ షాప్ కు వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. అనంతరం బాధితుడు రాజ్ కుమార్ ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారని తెలిపాడు. రౌడీల దాడితో ఎలక్ట్రీషియన్ రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రాజ్ కుమార్ వెంటనే హనుమకొండ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 307, 308(2), 115(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రౌడీ మూక కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వారు గ్యాంగ్ గా ఏర్పడి ఒంటిరిగా వున్న వారిపై దాడులు చేస్తుండటంతో వరంగల్ నగరంలో వరుస ఘటనలు స్థానికంగా కలవరపెడుతున్నాయి. కొంత కాలంగా యువకులు గ్యాంగ్ గా ఏర్పడి మద్యం, గంజాయి బానిసై దాడులకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే వారికిని పట్టుకుని కఠన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన నియమాలలో పెద్ద మార్పు.. అలా చేయకపోతే ఖాతా క్లోజ్!