యంగ్ హీరో రోషన్ మేకా కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ (Champion). పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ ఇంటెన్స్ డ్రామాను దర్శకుడు ప్రదీప్ అద్వైతమ్ తెరకెక్కించారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాయి. భారీ అంచనాల మధ్య 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేస్తోంది.
Also Read : Om Shanti Shanti Shantihi : జంటలకు బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచే (జనవరి 29) స్ట్రీమింగ్ అందుబాటులోకి తెచ్చింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, రోషన్ మేకా నటనకు, మేకింగ్ వాల్యూస్కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇందులో అనశ్వర రాజన్ హీరోయిన్గా నటించగా, మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక విభిన్నమైన పీరియాడిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హాయిగా వీక్షించవచ్చు. వీకెండ్ లో ఒక మంచి ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.