ఈరోజుల్లో టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. 10 రూపాయలు ఉన్న కిలో టమోటాలు ఇప్పుడు ఏకంగా రూ.200 లకు పైగా ఉందని చెప్పాలి.. టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో చాలా మంది కుండీల్లో, ఇంటి పైకప్పులపై టమోటా సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. కేవలం వ్యవసాయ భూముల్లో కాదు. ఇంటి పెరట్లో, కొద్దిపాటీ ఖాళీ స్థలంలో, ఇంటి పైకప్పుపై గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టమాట సాగు చేయవచ్చు. ఇంటి అవసరాలకే కాదు. ఎక్కువ దిగుబడులు సాధించి కొంత ఆదాయం కూడా తీసుకోవచ్చు..
ఇంటి పైకప్పుపై కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు పండించడం అనాదిగా వస్తూనే ఉంది. తీగజాతి మొక్కలను ఇంటి గోడల వెంట నాటి, వాటిని మిద్దె పైకి పాకించడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. పెరిగిపోతున్న జనాభాకు తోడు, నగరీకరణ వేగం పుంజుకోవడంతో సాగు భూమి తగ్గిపోతుంది. అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగు విధానాలు కూడా మారాల్సి ఉంది..ఇలా సేద్యం చెయ్యడం వల్ల ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను పండించుకోవచ్చు..
టమాటా పంటను పూర్వం పొలంలో సాగు చేసేవారు. సంకరజాతి వంగడాలు, తీగలా పాకే టమాటా రకాలు అందుబాటులోకి రావడంతో సాగు విధానంలో సమూల మార్పులు వచ్చాయి. ఎకరా తీగజాతి టమాట ద్వారా 150 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నాయి. ఇంటి పై కప్పుపై పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా టన్నుల కొద్దీ టమాటోలు పండించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టమోటా నారును నేరుగా కుండీల్లో వేసుకోవచ్చు..లేదా చిన్నపాటి నర్సరీలో 25 రోజుల పాటు టమాటా నారు పెంచుకుని కావాల్సిన చోట నాటుకోవచ్చు. ఈ పంటకు చీడపీడలు కూడా తక్కువే. మిద్దెపై సాగుచేసుకునేవారు సేంద్రీయ విధానాలు అవలంభించి అధిక దిగుబడి తీయవచ్చు.. మీకు ఇలాంటి ఆలోచన ఉంటే కానివ్వండి..