NTV Telugu Site icon

Minister Roja: బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు

Roja

Roja

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంత్రి ఆర్.కె. రోజా మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణీ మాట్లాడిన మాటలకు ఆమే కౌంటరిచ్చారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారని.. తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందని మంత్రి రోజా విమర్శించారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా అని ప్రశ్నించారు. దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించకండని ఎద్దేవా చేశారు. మా తాత ఇంత అవినీతి పరుడా అనుకుంటాడన్నారు.

Read Also: Telangana : 97 ఏళ్ల వయస్సులో కులవృత్తిని వదలని వృద్ధుడు.. హ్యాట్సాఫ్..

మీ మామ ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా అని బ్రాహ్మణీని ప్రశ్నించారు మంత్రి రోజా. మీ తాత ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో ఒకసారి చూస్తే చంద్రబాబు ఏంటో అర్థం అవుతుందని తెలిపారు. సాక్ష్యాధారాలు లేవు అని బ్రాహ్మణీ అంటోందని.. ఒకసారి సీఐడీ ఆఫీసుకు వెళ్ళి అడిగితే వాళ్ళే ఆధారాలు చూపిస్తారని పేర్కొన్నారు. బ్రాహ్మణికి చదువు చెప్పిన వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనుకుంటుందా? లేక దేశానికి ప్రధానిగా చేశాడని అనుకుంటోందా అని దుయ్యబట్టారు.

Read Also: Husbands Legal Rights: భార్యా బాధితుల్లారా మేల్కోండి.. మీకున్న చట్టపర హక్కుల గురించి తెలుసుకోండి?

మరోవైపు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చి కళ్యాణ్ కు ప్రపంచంలో ఉన్న అందరూ పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడని.. జగన్ రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్ళు అయిందని తెలిపారు. రెండు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఒకసారి ప్రతిపక్ష నేతగా, 151 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి రోజా అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ బతుకు ఎంత అని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అయినా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేపోయాడని విమర్శించారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ స్థాయికి మించి మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

Show comments