Site icon NTV Telugu

Rohit Sharma: బస్సు నడిపిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Rohit

Rohit

రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ను వదిలి బస్సును నడిపాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో బౌండరీలు బాదడమే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చలాకీతనం ప్రదర్శిస్తారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను తరలించే బస్సుకు రోహిత్ డ్రైవర్ గా మారారు.

Read Also: Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల సురేష్.. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం

డ్రైవర్ సీటులో కూర్చొని సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. అంతేకాకుండా.. బస్సు ముందున్న వారిని పక్కకు జరగండి అన్నట్లుగా సైగలు చేశారు. ఈ సందర్భంగా సహచరులు, అభిమానులు రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగారు. ఇక అక్కడే ఉన్న ఫ్యాన్స్​ రోహిత్​ను చూసి కేరింతలు కొట్టారు. దీంతో ఆ ప్రాంతం కాసేపు సందడిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్, ‘హిట్​మ్యాన్ గ్రౌండ్​లోనే కాదు, బయట కూడా జట్టను ముందుండి నడుపుతున్నాడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి రేంజ్ రోవర్ నడుపుతూ కనిపించిన సంగతి తెలిసిందే. రేంజ్ రోవర్ కాకుండా.. రోహిత్ శర్మ తన కార్ కలెక్షన్‌లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఖాళీ సమయం దొరికిందంటే డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తాడు.

Read Also: Kissing Incident: రోడ్డుపై వెళ్తున్న బాలికకు బలవంతంగా ముద్దు.. వీడియో వైరల్..

ఐపీఎల్‌ 2024లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్‌పై తీవ్ర విమర్శలు రావడం గమనార్హం. అయితే ఢిల్లీ, ఆర్‌సీబీలపై వరుసగా రెండు విజయాలతో ముంబై పుంజుకుంది. ఇకపోతే.. రోహిత్ శర్మ ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్​లు ఆడిన రోహిత్ 167.74 స్ట్రైక్​ రేట్​తో 156 పరుగులు చేశాడు. ఇందులో 17ఫోర్లు, 10 సిక్స్​లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే రోహిత్ 128 పరుగులు సాధించాడు.

 

Exit mobile version