Kissing Incident: రోడ్డుపై వెళ్తున్న బాలికకు బలవంతంగా ముద్దు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kissing Incident: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పగటిపూట రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఓ పిల్లాడిని ఎత్తుకుని వెళ్తున్న బాలికను ఓ వ్యక్తి వెంబడించి, బలవంతంగా ముద్దుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటన మథుర జిల్లా గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Read Also: Iran: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భయపడుతోంది..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
పశ్చిమ బెంగాల్‌కి చెందిన బాధిత బాలిక కుటుంబంతో కలిసి మథుర సందర్శించేందుకు వచ్చింది. బాలిక తన చేతిలో బిడ్డను ఎత్తుకుని వెళ్తున్న సమయంలో ఆమెను ఫాలో అయిన వ్యక్తి ఆమెపై అడ్డగించి ముద్దు పెట్టాడు. బాలిక అరుపులతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించి క్షమించాల్సిందిగా కోరాడు. స్థానిక పంచాయతీ సమావేశంలో 10 చెప్పు దెబ్బలతో శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటన తర్వాత బాలిక తన స్వరాష్ట్రం బెంగాల్‌కి వెళ్లింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. బాలికపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి చెప్పుదెబ్బలతో న్యాయం చేయాలనుకున్న పంచాయతీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
A girl from #WestBengal came to #Mathura with her family to visit religious places. Where she was staying, a boy living in the neighbourhood kissed the girl in public.
The accused was caught after being identified through CCTV. A panchayat was called in an ashram. (1/2) pic.twitter.com/pACxK21gqU— Siraj Noorani (@sirajnoorani) April 13, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!