NTV Telugu Site icon

Viral Video: వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరుగెత్తుకొచ్చిన రోహిత్.. వీడియో వైరల్!

Washington Sundar, Rohit

Washington Sundar, Rohit

Rohit Sharma funnily Warns Washington Sundar in IND vs SL 2nd ODI: కొలంబో వేదికగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో సుందర్ తన తప్పిదంను రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన రోహిత్.. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా వాషింగ్టన్ సుందర్ 33వ ఓవర్‌ వేశాడు. రెండో బంతిని వేసే ముందు సుందర్ రెండు సార్లు తన రనప్‌ను మిస్సయ్యాడు. రనప్ లెంగ్త్ మిస్సవ్వడంతో మొదటిసారి బంతి వేయలేదు. రెండోసారి స్లిప్ అవ్వడంతో బంతి వేయలేకపోయాడు. అప్పటికే మూడు సార్లు అలా చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి.. ఇంకోసారి ఇలా చేస్తే కొడతానని సరదాగా హెచ్చరించాడు. ఇది చూసిన సుందర్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

Also Read: Jeffrey Vandersay: నేను 6 వికెట్లు తీసినా.. ఈ గెలుపు క్రెడిట్‌ మాత్రం వారిదే: వాండర్సే

రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్‌లకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తన్నారు. జట్టు స్లో ఓవర్‌రేట్‌కు గురవుతుందని, కెప్టెన్‌ మ్యాచ్ ఫీజులో కోత పడుతుందనే రోహిత్ అలా సరదాగా బెదిరించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Show comments