NTV Telugu Site icon

Rishabh Pant injured: రిషబ్ పంత్ మోకాలికి గాయం.. సర్జరీ అయిన చోటే తగిలిన బంతి..

Rishabh Pant Injured

Rishabh Pant Injured

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్‌లో రిషబ్ పంత్ కాలికి గాయం అయ్యింది. ఈ ఓవర్ ఆఖరి బంతిని డెవాన్ కాన్వే డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్ స్టంప్‌కు దగ్గరగా వెళ్తూ రిషభ్ పంత్ కుడి మోకాలికి బలంగా తాకింది. ప్యాడ్స్ సరిగ్గా కవర్ చేయలేకపోయాయి. అదే కాలుకు శస్త్రచికిత్స జరిగింది.

READ MORE: Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కీలక నిర్ణయం.. ఆదాయం కోసం కొత్త ప్లాన్‌!

వెంటనే ఫిజియోలు అతన్ని తనిఖీ ప్రథమ చికిత్స చేసినా.. లాభం లేకుండా పోయింది. దీంతో మైదానం నుంచి వెనుదిరిగాడు పంత్.. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ రంగంలోకి దిగాడు. 2022లో కారు ప్రమాదంలో అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్న రిషబ్ కుడి కాలు మోకాలికి బంతి తగలడంతో పరిస్థితిపై రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తూ బంతి సరిగ్గా పంత్‌ మోకాలి చిప్పకు తగిలింది. గతంలో అక్కడే శస్త్రచికిత్స జరిగింది. అందుకే మోకాలు వాపు వచ్చింది. కండరాలు కూడా పట్టేశాయి. మేం రిస్క్‌ తీసుకోదల్చుకోలేదు. ముందు జాగ్రత్త చర్యగా అతడిని డ్రెస్సింగ్‌ రూమ్‌కి పంపించాం. ” అని తెలిపాడు.

READ MORE:Minister Nadendla Manohar: అధిక ధరకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు.. సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి