Rohit Sharma: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన చివరి మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్‌ను జస్ట్‌లో మిస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టలేకపోయాడు. మూడో వన్డేలో 73 బంతుల్లో 75 పరుగులు చేసి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు బాటపట్టాడు. రోహిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది దక్షిణాఫ్రికాపై విరుచుపడ్డాడు. అంతకు ముందు రోహిత్ 54 బంతుల్లో తన కెరీర్‌లో 61వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
READ ALSO: BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా రోహిత్ మొత్తం 5 సిక్సర్లు బాది ఉంటే, వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును తన పేరు మీద లిఖించుకునే వాడు. హిట్‌మ్యాన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకోవడానికి కేవలం 2 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. వన్డేల్లో గేల్ ఓపెనర్‌గా 274 ఇన్నింగ్స్‌ల్లో 328 సిక్సర్లు కొట్టగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ ఓపెనర్‌గా 190 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 327 సిక్సర్లు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 73 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులు చేయగా, కోహ్లీ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 116 పరుగులు చేశాడు. అంతకుముందు ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొత్తంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10.1 ఓవర్లు, తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
READ ALSO: IndiGo Crisis: ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు.. ?