NTV Telugu Site icon

World Cup 2023: స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం

Rohit Sharma

Rohit Sharma

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆఫ్ఘానిస్తా్న్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుపొందాడు. అయితే ప్రోమోలో అతను కనబడలేదు.

Babar Azam: బాబర్ ఆజంకు బ్యాడ్ న్యూస్.. ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై..!

టోర్నీ మొదటి మ్యాచ్ మినహా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నీ మ్యాచ్ ల్లోనూ రాణించాడు. ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో శతకం కూడా సాధించాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో రెండు సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా జట్టుకు కావాల్సినప్పుడు పరుగులు అందించిపెట్టాడు. అయితే స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో చూశాక విరాట్ కోహ్లీ అభిమానులు ఆనందంగా ఉంటే.. రోహిత్ అభిమానులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు వరల్డ్ కప్ ప్రోమోలో చోటు ఇవ్వలేదు. అటు షమీని కూడా ప్రోమోలో చేర్చారు. దాంతో రోహిత్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ కు కనీస గౌరవం కూడా ఇవ్వలేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షేమ్ స్టార్ స్పోర్ట్స్ అంటూ మండిపడుతున్నారు.

Sunnapu Vasantham: కాంగ్రెస్ నేత సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు

స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తుంది. టీమిండియా ఆడిన 8 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచింది. అయితే ఈ విజయాల్లో ప్రతి ఒక్క ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగంలో ఆటగాళ్లు అదరగొట్టారు.

Show comments