Rohit-Chahal: చహల్‌ను చితకబాదిన రోహిత్.. పక్కనే కోహ్లీ! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funny Incident between Rohit Sharma and Yuzvendra Chahal in IND vs WI 2nd ODI: బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో శనివారం రాత్రి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డగౌట్లో కూర్చున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను చితకబాదాడు. అయితే ఇదంతా సరదగానే జరిగింది. చహల్ పక్కనే ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సరదా ఘటనను తెగ ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. యుజ్వేంద్ర చహల్, జయదేవ్ ఉనద్కత్‌లకు చోటు దక్కలేదు. విండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ నలుగురు డగౌట్లో కూర్చున్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్ నడుస్తుండగా.. పక్కనే కూర్చున్న చహల్ తలపై రోహిత్ ఒక్కటిచ్చాడు. ఆపై ఒంగోబెట్టి మరీ వీపుపై దంచాడు. దాంతో యూజీ నొప్పితో ఒళ్లు విరుచుకున్నాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న కోహ్లీ, ఉనద్కత్ నవ్వును ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ కూడా నవ్వుకుంటున్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Police Bike Stunts: యూనిఫాంలో పోలీస్ బైక్ స్టంట్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అధికారులు!
రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చహల్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు అప్పుడప్పుడు ఇలా సరదాగా కొట్టుకుంటారు. యూజీకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అందులో భారత ఆటగాళ్లకు సంబందించిన వీడియోస్, ఇంటర్వ్యూస్ పోస్ట్ చేస్తుంటాడు. చహల్‌కు ‘అల్లరి పిల్లాడు’ అనే బిరుదు కూడా ఉంది. ఇక చహల్ తన ఐపీఎల్ అరంగేట్రం కూడా ముంబై ఇండియన్స్ తరపునే రోహిత్ కెప్టెన్సీలో చేశాడు.
యుజ్వేంద్ర చహల్‌కు వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్ రెండు మ్యాచులలో ఆడగా.. అక్షర్ పటేల్ రెండో వన్డేలో ఆడాడు. మూడో వన్డేలో కూడా యూజీకి అవకాశం దక్కకపోవచ్చు. ఇక కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చింది. సిరీస్ డిసైడర్ మూడో వన్డే ట్రినాడాడ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్, కోహ్లీ తిరిగి రానున్నారు.
Also Read: Nicholas Pooran Century: 40 బంతుల్లో సెంచరీ.. తొలి ఆటగాడిగా నికోలస్ పూరన్ అరుదైన రికార్డు!
https://twitter.com/SPORTYVISHAL/status/1685650868618887169?s=20
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!