NTV Telugu Site icon

Rohit-Chahal: చహల్‌ను చితకబాదిన రోహిత్‌.. పక్కనే కోహ్లీ! వీడియో వైరల్

Rohit Chahal

Rohit Chahal

Funny Incident between Rohit Sharma and Yuzvendra Chahal in IND vs WI 2nd ODI: బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో శనివారం రాత్రి భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ.. డగౌట్‌లో కూర్చున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను చితకబాదాడు. అయితే ఇదంతా సరదగానే జరిగింది. చహల్‌ పక్కనే ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సరదా ఘటనను తెగ ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. యుజ్వేంద్ర చహల్‌, జయదేవ్ ఉనద్కత్‌లకు చోటు దక్కలేదు. విండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ నలుగురు డగౌట్‌లో కూర్చున్నారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్ నడుస్తుండగా.. పక్కనే కూర్చున్న చహల్‌ తలపై రోహిత్ ఒక్కటిచ్చాడు. ఆపై ఒంగోబెట్టి మరీ వీపుపై దంచాడు. దాంతో యూజీ నొప్పితో ఒళ్లు విరుచుకున్నాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న కోహ్లీ, ఉనద్కత్ నవ్వును ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ కూడా నవ్వుకుంటున్నారు.

Also Read: Police Bike Stunts: యూనిఫాంలో పోలీస్‌ బైక్‌ స్టంట్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అధికారులు!

రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చహల్‌ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు అప్పుడప్పుడు ఇలా సరదాగా కొట్టుకుంటారు. యూజీకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అందులో భారత ఆటగాళ్లకు సంబందించిన వీడియోస్, ఇంటర్వ్యూస్ పోస్ట్ చేస్తుంటాడు. చహల్‌కు ‘అల్లరి పిల్లాడు’ అనే బిరుదు కూడా ఉంది. ఇక చహల్‌ తన ఐపీఎల్‌ అరంగేట్రం కూడా ముంబై ఇండియన్స్‌ తరపునే రోహిత్ కెప్టెన్సీలో చేశాడు.

యుజ్వేంద్ర చహల్‌కు వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్ రెండు మ్యాచులలో ఆడగా.. అక్షర్ పటేల్ రెండో వన్డేలో ఆడాడు. మూడో వన్డేలో కూడా యూజీకి అవకాశం దక్కకపోవచ్చు. ఇక కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చింది. సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే ట్రినాడాడ్‌ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్‌, కోహ్లీ తిరిగి రానున్నారు.

Also Read: Nicholas Pooran Century: 40 బంతుల్లో సెంచరీ.. తొలి ఆటగాడిగా నికోలస్‌ పూరన్‌ అరుదైన రికార్డు!