ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దిగుమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో భారీ దారి దోపిడికి పాల్పడ్డారు దుండగులు. కారుతోపాటు కేజీ 700 గ్రాముల బంగారం, 20 లక్షల నగదును ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారులు, నంద్యాల నుంచి నరసరావుపేటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే.. కారులో మొత్తం నలుగురు బంగారు వ్యాపారులు ఒక డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో పురోగతి.. సహాయ నటుడు అరెస్ట్
అయితే.. నంద్యాల నుండి బంగారు వ్యాపారులను వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తరచూ ఇదే మార్గంలో ప్రయాణించే వ్యాపారులు కావటంతో పక్కా సమాచారంతో దోపిడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కృష్ణంశెట్టీపల్లె సమీపంలో భీమలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దుండగులు ఎత్తుకెళ్లిన కారును గుర్తించారు పోలీసులు. అయితే.. కారు డాష్ బోర్డ్ లో ఉన్న కేజీ బంగారం, 14 లక్షల బంగారాన్ని దుండగులు గుర్తించక కారులోనే వదిలి వెళ్లినట్లు సమాచారం. అయితే.. కారును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత