Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: గత నాలుగు నెలలుగా వరుస విషాదాలు టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటులుగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరసనాటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు. మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఈ ఆదివారం (డిసెంబర్ 25) తెల్లవారుజామున గుండెపోటుతో చలపతిరావు తుదిశ్వాస విడిచారు. చలపతిరావు 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి పన్నెండు వందలకు పైగా చిత్రాలలో అనేక విభిన్న పాత్రల్లో నటించారు. చలపతిరావు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన చలపతిరావు మృతి తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కృష్ణంరాజు ఈ ఏడాది కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణిస్తున్న కృష్ణంరాజు మృతి టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read also: Atal Bihari Vajpayee: “అటల్” మీకు “సలాం”..
Also Read
తనదైన నటనతో, సాహసాలతో టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన నటశేఖర కృష్ణ ఈ ఏడాది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన నవంబర్ 15న మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేల సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న కన్నుమూశారు. యముడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన మరణం టాలీవుడ్ ను కుదిపేసింది. నిన్న డిసెంబర్ 24న ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే చలపతిరావు మృతిచెందిన వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫలితంగా గత నాలుగు నెలల్లో నలుగురు దిగ్గజ నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ వంటి హాస్యనటులు నెలరోజుల్లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
Tsunami in Indonesia: ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..