Robbery: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు. దోపిడికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని (A1 శుభమ్ కుమార్) పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు (A2 బిశ్వజిత్ పండా) పరారీలో ఉన్నారు.ఒడిశాకు చెందిన నిందితులు ఇద్దరు గతంలో ఈ బార్‌లో పనిచేసినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం వీరిని పనిలో నుంచి బార్ ఓనర్ తీసివేశారు. అది మనస్సులో పెట్టుకుని ఈ విధంగా దోచుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది.
Read Also: Prakasam Crime: పిల్లను ఇచ్చి పెళ్లి చేశారు.. ఊరికే కన్నం వేసిన దొంగ అల్లుడు..!