ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో 'టీ-స్క్వేర్'ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లాగా ఐకానిక్‌లా కనిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 'టీ-స్క్వేర్' నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది.