Robbery : ఏసీబీ సీఐ ఇంట్లోనే చోరీ.. రంగంలోకి దిగిన క్లూ టీమ్.
సామాన్యుల ఇంట్లో చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, కానీ అదే పోలీసుల ఇంట్లోనే దొంగతనం జరిగితే..? ఎవరూ లేని వేళ సీఐ ఇంట్లోనే చోరీ చేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంగలు. శ్రీకాకుళంలో అవినీతి నిరోధక శాఖ సీఐగా విధుల నిర్వర్తిస్తున్న హరి శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 3న సారవకోటకు వెళ్లిన హరి ఊరికి వెళ్లే ముందు పెరట్లోని గ్రిల్స్‌కి తాళం వేయడం మరిచిపోయాడు. గ్రిల్ డోర్స్ కూడా సరిగ్గా వేయకపోవడంతో అదే అవకాశంగా సదరు అధికారి ఇంట్లోకే చొరబడ్డారు దొంగలు.
Also Read : మేకప్ లేకుండానే హెబ్బా పటేల్.. అమెరికా వీధుల్లో అలా తిరుగుతుందేంటి
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
లోపలికి వెళ్లగానే బెడ్ రూంలో బీరువా తాళాలు కనిపించడంతో వాళ్ల పంట పండిందనుకున్నారు. అవకాశం పోతే మళ్లీ రాాదు అనుకున్నారేమో దొరికినదంతా దోచేసుకున్నారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన హరికి ఇంటి పెరట్లోని తలుపులు తీసి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి చూసిన ఆయనకు తన ఇంట్లో చోరీ జరిగిందని అర్థమైంది. ఆ వెంటనే క్లూ టీమ్‌కి సమాచారం అందించగా.. వారు వచ్చి వేలిముద్రలు, తదితర ఆనవాళ్లు సేకరించారు. కాగా, తన ఇంట్లోని ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు సీఐ హరి ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు ఒడిశాకు చెందిన వ్యక్తులే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు జాగ్రత్తగా తాళం వేసుకున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు…!
Also Read : Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!