పల్నాడు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. అతి తక్కువ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ప్రయాణికుల జాడ ఇంకా లభ్యం కాలేదని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read: Nayanthara : మరోసారి ఆ స్టార్ హీరోకు జోడిగా నయన్.. డైరెక్టర్ ఎవరంటే?
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వచ్చారు ప్రజలు. ఓటు హక్కు వినియోగించుకునే తర్వాత క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాపట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సు నడుస్తోంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జనగంజాం, గోనసపూడి, నిలయపాలెం గ్రామాలకు చెందిన వారని తెలిసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబట్ల వారి పాలెం – పసుమర్రు గ్రామాల మధ్య కంకర డంప్ లారీ బస్సును ఢీకొట్టింది. కొద్దిసేపటికే డంప్ లారీలో మంటలు చెలరేగగా, అతివేగం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: Bhatti Vikramarka: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒరిస్సాకు డిప్యూటీ సీఎం..
తారురోడ్డుపై భారీగా మట్టి పేరుకుపోవడం, డంప్ లారీ అతివేగంగా వెళ్లడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం జరిగి బస్సులో మంటలు చెలరేగడంతో అందరూ వెంటనే బస్సు దిగేందుకు ప్రయత్నించారు. చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో బస్సు, , లారీ ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సబ్బయింది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.