NTV Telugu Site icon

RK Roja: రేపు అదే రిపీట్ అవుతుంది.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు.. రోజా వార్నింగ్‌

Roja

Roja

RK Roja: కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమన్న ఆమె.. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా…? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా? అని నిలదీశారు.. వైసీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డ ఆమె.. వైసీపీ వాళ్లు కట్టే పనులను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదా..? అని నిలదీశారు.. వైసీపీ నేతలపై హత్యాయత్నాలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు.. సిడి ఫైల్లు కోర్టులకు ఇవ్వకుండా, తప్పుడు నెంబర్లు వేసి వాళ్లని జైల్లోనే మగ్గనిచ్చేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా.. ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారని మండిపడ్డారు రోజా.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప.. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని ఏపీ ప్రజలకు అర్థమైందన్నారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పైన పెట్టిన శ్రద్ధ… ఎల్లో బుక్ మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు..? అని నిలదీశారు.. ఇక, రేపు అదే రిపీట్ అవుతుంది.. జగన్మోహన్ రెడ్డి వస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. వైసీపీకి తెలిసో తెలియకో ఎటువంటి సహాయం చేయొద్దు అన్నారంటే.. ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ సీఎం చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్కే రోజా..