RK Roja: రేపు అదే రిపీట్ అవుతుంది.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు.. రోజా వార్నింగ్
- టీడీపీ నేతలకు రోజా సీరియస్ వార్నింగ్..
- ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా..
- రేపు అదే రిపీట్ అవుతుంది..
- వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమన్న ఆమె.. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా…? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా? అని నిలదీశారు.. వైసీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డ ఆమె.. వైసీపీ వాళ్లు కట్టే పనులను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదా..? అని నిలదీశారు.. వైసీపీ నేతలపై హత్యాయత్నాలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు.. సిడి ఫైల్లు కోర్టులకు ఇవ్వకుండా, తప్పుడు నెంబర్లు వేసి వాళ్లని జైల్లోనే మగ్గనిచ్చేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా.. ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారని మండిపడ్డారు రోజా.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప.. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని ఏపీ ప్రజలకు అర్థమైందన్నారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పైన పెట్టిన శ్రద్ధ… ఎల్లో బుక్ మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు..? అని నిలదీశారు.. ఇక, రేపు అదే రిపీట్ అవుతుంది.. జగన్మోహన్ రెడ్డి వస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీకి తెలిసో తెలియకో ఎటువంటి సహాయం చేయొద్దు అన్నారంటే.. ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!