NTV Telugu Site icon

RK Roja: అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి.. రోజా ఫైర్..

Rk Roja

Rk Roja

RK Roja: నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఆమె. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వంశీ, కిరణ్, పురుషోత్తంలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఒక్కరోజే 15 వికెట్లు

నారా లోకేష్‌ను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. మీ నాయకత్వానికి గౌరవం పెరగాలంటే, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ, అధికారం ఉందని దళితులపై దాడులు చేయడాన్ని మానవజాతి క్షమించదని, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ఆవిడ అన్నారు. ఈ సందర్భంగా రోజా, దళితుల హక్కులను కాపాడటంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను కట్టడి చేయాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల ఆగ్రహానికి దారితీసింది.

Also Read: Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు

Show comments