జబర్దస్త్ నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ మొదట సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది.. ఇది ఇలా ఉంటే ఇటీవల రీతూ చౌదరి తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి తరచూ రీతూ చౌదరి తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఒక ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఇబ్బందికి గురయ్యానని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రీతూ చౌదరి మాట్లాడుతూ.. మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను నేను ఒకతనికి అప్పజెప్పాను. అందుకు గాను అతనికి రూ. 5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెప్పినట్లు చేయలేకపోయాడు. పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేసి ఇబ్బంది పెట్టాడు.. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు. తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడు. అలా ఒక వైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా బాధపడ్డాను.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడంతో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడమే కాకుండా ఆర్థికంగా ఎంతో మోసపోయాను.ఎన్నోసార్లు తీవ్రంగా భాధ పడ్డాను అని రీతూ చౌదరి తెలిపింది . అయితే అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్ వర్క్‌ను మళ్ళీ వేరే వాళ్లకు అప్పగించాను. ప్రస్తుతం వర్క్ పూర్తి అవుతుంది.నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటూ రీతూ చౌదరి తెలిపింది