NTV Telugu Site icon

Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్‌కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు

Rishab

Rishab

చాలా కాలం తర్వాత టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్‌ ఆడిన రిషబ్‌ పంత్‌.. సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన ఘోర ప్రమాదంతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ము రేపాడు. దీంతో.. సెంచరీ చేశాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత పంత్.. ఆకాశం వైపు చూసి కళ్లు మూసుకుని మరోసారి దేవుడిని ప్రార్థించాడు. అనంతరం తనదైన శైలిలో హెల్మెట్ తీసి.. అభిమానులకు బ్యాట్‌తో అభివాదం చేశాడు.

Read Also: Lucknow: ఎంతకు తెగించాడంటే.. డబ్బుల కోసం కొడుకు ఏం చేశాడంటే..?

మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్.. కేవలం 39 పరుగులు మాత్రమే చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 109 పరుగులు సాధించాడు. దీంతో.. బంగ్లాదేశ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. కాగా.. రెండవ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో తొలి, రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. కాగా.. లక్ష్య ఛేదనలో బంగ్లా 234 పరుగులకు కుప్పకూలడంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Read Also: MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..