NTV Telugu Site icon

IND vs AUS: రిషబ్ పంత్ చేతికి గాయం.. వాపేక్కిన సరే తగ్గేదేలే..!

Rishabh Pant

Rishabh Pant

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్‌ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది. చాలా బంతులు రిషబ్ పంత్ శరీరానికి తగిలాయి. అతను గాయపడటంతో మ్యాచ్ 2-3 సార్లు ఆగిపోయింది.

Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్ ఢీ కొట్టడంతో గుంతలో పడ్డ ఆరు కార్లు..

టాప్ ఆర్డర్లు విఫలమైనప్పటికీ.. రిషబ్ పంత్ ఒక ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 80 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 32 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే.. రెండో సెషన్‌లో మిచెల్ స్టార్క్ వేసిన బంతి రిషబ్ పంత్ ఎడమ చేతికి తగిలింది. ఈ క్రమంలో.. రిషబ్ పంత్ నొప్పితో కేకలు వేశాడు. కొన్ని సెకన్ల తర్వాత దెబ్బ తగిలిన చోట మచ్చలా ఏర్పడింది. వెంటనే ఫిజియో పంత్ దగ్గరికి వచ్చి ఐస్ పూసి వాటిని టేప్ చేశాడు. అయితే పంత్ తిరిగి ఆటను కొనసాగించడం గమనార్హం. కాగా స్టార్క్ వచ్చి పంత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్టార్క్ వేసిన మరో ఓవర్‌లో బంతి రిషబ్ పంత్ హెల్మెట్‌ను తాకింది.

Read Also: Jathara Song Full Video: జాతర సాంగ్ వీడియో వచ్చేసింది భయ్యా.. చూశారా?

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి సెషన్‌లో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ వరకు భారత్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ రూపంలో మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ చివరి బంతికి గిల్ ఔటయ్యాడు. రెండో సెషన్‌లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా మధ్య 5వ వికెట్‌కు 111 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.