Rishabh Pant-Shubman Gill: పంత్ బౌలింగ్.. గిల్‌కు ముచ్చెమటలు (వీడియో)
- టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియో
- వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- గిల్‌కు బౌలింగ్ చేస్తున్న రిషబ్ పంత్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో జరుగనున్న టెస్ట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో చెన్నైలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. రెండో టెస్టుకు ముందు, మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుంది. నెట్స్‌లో బ్యాటింగ్‌లో, స్టార్ ఇండియా బ్యాటర్లు రిషబ్ పంత్ మరియు శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన క్షణం వైరల్ అయ్యింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పంత్ గిల్‌కు ముచ్చెమటలు పట్టించాడు. పంత్ బౌలింగ్ చేస్తుంటే.. గిల్ కష్టంగా ఆడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోలో మీరు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కూడా బౌలింగ్ చేశారా అని పంత్‌ను కేఎల్ రాహుల్ అడిగాడు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also: Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఫీల్డింగ్ చేస్తే మహ్మద్ సిరాజ్ లేదా ఆకాశ్ దీప్‌లలో బెంచ్ కు పరిమితం కానున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఉంటే.. బ్యాట్స్ మెన్ బౌలింగ్ చేయడం మామూలే.. కానీ వికెట్ కీపర్ బౌలింగ్ చేయడం అనేది వింతగా ఉంది.
Read Also: Stock market: మరోసారి ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్
ఇదిలా ఉంటే.. ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్‌లో పంత్ బౌలింగ్ చేశాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్ వేశాడు. కుడి చేతి వాటంతో స్పిన్ బౌలింగ్ వేశాడు. కాగా.. రిషభ్ పంత్ బౌలింగ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం పంత్‌పై చూపిందని.. అందుకే ఇలా బౌలర్ అవతారం ఎత్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటనలో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి టీమిండియా స్పెషలిస్టు బ్యాటర్లు సైతం బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.
Spin bowling practice anyone? 🤔
We have a new spinner in town 😎@RishabhPant17 rolls his arm over 👌👌#TeamIndia | #INDvBAN | @ShubmanGill | @klrahul | @IDFCFIRSTBank pic.twitter.com/nlifAHo9Qu
— BCCI (@BCCI) September 26, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!