NTV Telugu Site icon

Rishabh Pant-Shubman Gill: పంత్ బౌలింగ్‌.. గిల్‌కు ముచ్చెమటలు (వీడియో)

Pant Gill

Pant Gill

బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో జరుగనున్న టెస్ట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో చెన్నైలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. రెండో టెస్టుకు ముందు, మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుంది. నెట్స్‌లో బ్యాటింగ్‌లో, స్టార్ ఇండియా బ్యాటర్లు రిషబ్ పంత్ మరియు శుభ్‌మన్ గిల్ మధ్య జరిగిన క్షణం వైరల్ అయ్యింది.

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పంత్ గిల్‌కు ముచ్చెమటలు పట్టించాడు. పంత్ బౌలింగ్ చేస్తుంటే.. గిల్ కష్టంగా ఆడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోలో మీరు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కూడా బౌలింగ్ చేశారా అని పంత్‌ను కేఎల్ రాహుల్ అడిగాడు.

Read Also: Devara: నైట్ ఒంటి గంటకు 500 షోలు.. మెంటలెక్కిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్

కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఫీల్డింగ్ చేస్తే మహ్మద్ సిరాజ్ లేదా ఆకాశ్ దీప్‌లలో బెంచ్ కు పరిమితం కానున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఉంటే.. బ్యాట్స్ మెన్ బౌలింగ్ చేయడం మామూలే.. కానీ వికెట్ కీపర్ బౌలింగ్ చేయడం అనేది వింతగా ఉంది.

Read Also: Stock market: మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్

ఇదిలా ఉంటే.. ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్‌లో పంత్ బౌలింగ్ చేశాడు. లీగ్‌ తొలి మ్యాచ్లో చివరి ఓవర్‌ వేశాడు. కుడి చేతి వాటంతో స్పిన్ బౌలింగ్ వేశాడు. కాగా.. రిషభ్ పంత్ బౌలింగ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం పంత్‌పై చూపిందని.. అందుకే ఇలా బౌలర్ అవతారం ఎత్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటనలో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి టీమిండియా స్పెషలిస్టు బ్యాటర్లు సైతం బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.