రోజూ ఎక్కడో ఒకచోట మహిళలు లైంగికంగా వేధించబడుతున్నారు. అయితే తాజాగా మరో ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడో అధికారి. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ రెవెన్యూలో విజయ నాయక్ ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. ముషీరాబాద్ రెవెన్యూలో ఓ సర్టిఫికెట్ కోసం యువతి వచ్చింది. అయితే.. సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా రావాలని యువతికి విజయ్ చెప్పాడు. దీంతో.. తల్లిదండ్రులను తీసుకొని సర్టిఫికెట్ కోసం వెళ్లింది యువతి.
అయితే.. తల్లిదండ్రుల ఎదుటనే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్. దీంతో.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్‌కి బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు దేహ శుద్ది చేశారు. ఎమ్మార్వో ఎదుటనే అర్ఐని బాధితురాలి బంధువులు చితకబాదారు. అయితే.. విషయం తెలుసుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.