రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ కనిపించినా వార్తే.. ఆయన ఏ మాట అన్న వివాదమె.. ఇండస్ట్రీకి కూడా ఇది అలవాటు అయిపోయింది. ఒక్కప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులో తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వర్మ.. ఈ మధ్య మాత్రం సినిమాల కంటే ఎక్కువగా తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టుల వల్లే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక తాజాగా పైరసీపై నడుస్తున్న పెద్ద చర్చకి ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత పెట్రోల్ పోసినట్టు అయ్యాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనతో పైరసీ మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
Alsso Read : Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ ఫైనల్ వార్.. హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ
“నాకు ఆసక్తి ఉన్న సినిమానే థియేటర్‌లో చూస్తా. ఆసక్తి లేకపోతే నేరుగా పైరసీలో చూస్తా. వాళ్ల కలెక్షన్‌ల గురించి నేనెందుకు ఆలోచించాలి?” అంటూ వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక అంతటితో ఆగకుండా.. “ ఏది తక్కువలో దొరుకుతుందో అదే చూస్తారు. ఆడియన్స్ మెంటాలిటీ అలాంటిది.. టెక్నాలజీ ఉన్నంత కాలం పైరసీని ఆపడం అసంభవం. సినిమా వాళ్లే తప్ప ఆడియన్స్‌ను ఏమాత్రం తప్పుబట్టలేరు” అని అన్నారట.
పైరసీ వల్ల నిర్మాతలు పడుతున్న నష్టాల గురించి మాట్లాడుతూ.. “పైరసీని ఆపితే మీకు వచ్చే డబ్బుల్లో కొంచెం ఎక్కువే వస్తాయి. అంతకంటే పెద్ద నష్టం ఏమీ లేదు. మీరు మాత్రం రెమ్యునరేషన్‌లు పెంచేసుకుని, ఆ డబ్బుల్ని ప్రేక్షకుల జేబుల నుంచి రాబట్టుకోవడం సరి కాదు” అని నేరుగా చెప్పేశారట. వర్మ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంతమంది.. ‘ఇండస్ట్రీలో ఉన్న మనిషి ఇలా మాట్లాడటం ఏమిటి?’ అని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘ఇది వర్మ స్టైల్ అతను మాట్లాడేదంతా స్ట్రైట్‌ఫార్వడ్‌గానే ఉంటుంది’ అని ఫన్ గా తీసుకుంటున్నారు.