NTV Telugu Site icon

RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన

Rgv

Rgv

RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ వంటి నేతల ఫోటోలను మార్ఫ్ చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రకాశం పోలీసులు రెండు దఫాలుగా ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. మొదట నోటీసులకు గడువు కావాలని కోరిన వర్మ, ఆ తర్వాత విచారణకు హాజరుకాలేదు. ఇంతలో, పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి ఎదురు చూసినప్పటికీ, ఆయన షూటింగ్ నిమిత్తం వెళ్లిపోయినట్లు తేలింది.

THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు

తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానమిస్తానని తెలిపారు. కేసులను తాను భయపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. గత సంవత్సర క్రితం చేసిన ట్వీట్‌ కారణంగా, వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టడం విచిత్రమని పేర్కొన్నారు. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నా అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. తనపై సెక్షన్ల ప్రభావం ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉందని వర్మ అన్నారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్‌లలో ఉండటంతో, ఈ కేసులపై తన విధానాన్ని చట్టపరంగా కొనసాగిస్తానని చెప్పారు. వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రకాశం జిల్లా పోలీసులు తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Mega DSC: గుడ్‌న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్‌పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?